Abn logo
Sep 25 2021 @ 08:12AM

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 80,389 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 87,306 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా...ప్రస్తుత సామర్థ్యం 311.14 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను..ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. 

ఇవి కూడా చదవండిImage Caption