Nallagonda: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-08-09T13:24:05+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 73,048 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిసామర్ధ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311 టీఎంసీలుగా ఉంది.