ప్రారంభమైన ఉపసంహరణలు

ABN , First Publish Date - 2021-03-03T05:35:32+05:30 IST

అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు తొమ్మిది మంది పో టీ నుంచి తప్పుకున్నారు.

ప్రారంభమైన ఉపసంహరణలు
అద్దంకి నగరపంచాయతీ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్‌ఐలు

అద్దంకిలో పోటీ నుంచి తప్పుకున్న 9 మంది

8వ వార్డు నుంచి ఇద్దరు టీడీపీ అభ్యర్థులూ ఉపసంహరణ


అద్దంకి, మార్చి 2 : అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు తొమ్మిది మంది పో టీ నుంచి తప్పుకున్నారు. మొత్తం 20 వార్డులకు 132 మంది నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన సమ యంలో ఒకటి తిరస్కరణకు గురైంది. దీంతో 131 మం ది మిగిలారు. వీరిలో మంగళవారం తొమ్మిది మంది త మ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బుధవా రం సాయంత్రం 3 గంటల వరకూ గడువు ఉండటం తో మరికొంత మంది విరమించుకునే అవకాశం ఉంది. తొలిరోజు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో టీడీపీకి చెందిన వారు నలుగురు, వైసీపీకి చెందిన నలుగురు, ఒక ఇండిపెండెంట్‌ ఉన్నారు. టీడీపీ నుంచి తప్పుకున్న వారిలో  4వ వార్డు నుంచి మాగులూరి ల క్ష్మి, 8వ వార్డు నుంచి కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావు, 20వ వార్డు నుంచి గుంజి కల్యాణ్‌ శ్రీనివాసరావు ఉన్నారు.  వైసీపీ నుంచి 5వ వార్డులో నామినేషన్‌ వే సిన దేసు ఆంజనేయులు, 14వ వార్డులో షేక్‌ జకీరా, 19వ వార్డులో వేజెండ్ల రామాంజనేయులు, 20వ వా ర్డులో ఆలకుంట శ్రీనివాసరావు పోటీ నుంచి ఉప సంహరించుకున్నారు. ఇండిపెండెంట్‌గా 20వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఆలకుంట విజయరామరాజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉత్ప న్నంకాకుండా సీఐ ఆంజనేయరెడ్డి, సర్కిల్‌ పరిధిలో ని ఎస్సైలు మహే్‌ష, అనూక్‌, శివనాంచార య్య, ఖాదర్‌బాషా, భ వానీ బందోబస్తు ని ర్వహించారు.


అందరి చూపూ 8వ వార్డుపైనే.


అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలలో అందరి చూపు ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయిన 8వ వార్డుపై పడింది. ఆ వా ర్డు నుంచి నామినేషన్‌లు దాఖలు చేసిన న లుగురు అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభమైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యారు. మారిన రాజకీ య సమీకరణల నేపథ్యంలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీ నాయకులు లోబర్చు కున్నారు. అదే సమయంలో వైసీపీ తరఫున నామినేష న్‌ వేసిన ఇద్దరిలో ఒకరిని ఆపార్టీ వారు,  మరో అ భ్యర్థిని టీడీపీ నాయకులు ఆధీనంలో ఉంచుకున్న ట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన కత్తి కామయ్య, ఇండ్లా కోటేశ్వరరావు  మంగళవారం మఽ ద్యాహ్నం నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ నామినేషన్‌ లను ఉపసంహరించుకున్నారు. దీంతో వైసీ పీకి చెందిన  ఇద్దరి  నామినేషన్లు మిగిలి ఉ న్నాయి. బుధవారం సా యంత్రం 3 గంటల వర కూ ఉపసంహరణకు గడువు ఉండటంతో వైసీపీ తరఫున మి గిలి ఉన్న ఇద్దరిలో ఒకరు వచ్చి నా మినేషన్‌ ఉపసంహరించుకుంటే రెండో వ్యక్తి ఏకగ్రీవమయ్యే అవకాశం  ఉంది. ఇద్దరూ బరిలో ఉం డి ఒకరికి  వైసీపీ తరఫున బీఫాం ఇస్తే రెండో వ్యక్తి ఇండిపెండెంట్‌గా మిగులుతారు. ఆయనకు టీడీపీ మ ద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. 


చీమకుర్తిలో 20...


 చీమకురి: చీమకుర్తి నగరపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళ వారం ప్రారంభమైంది. వైసీపీ తరపున నామినేషన్‌ వేసిన 16 మంది, టీడీపీ నుంచి  3, ఇండిపెండెంట్‌ ఒ కరు అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరిం చుకున్నారు. ఇంకా 63 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. బుధవారం ఉపసంహరణకు తుది గడువు. కా గా 14వార్డు పరిధిలో టీడీపీ తరపున నామినేషన్‌ దా ఖలు చేసిన రామడుగు సుబ్బులు, లూధీయాలు, వై సీపీ అభ్యర్థి ఉట్టికొండ సుశీల తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో మిగిలిన వై సీపీ అభ్యర్థి పొదిలి వెంకాయమ్మ ఏకగ్రీవమయ్యారు. మరోవైపు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు త మ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.


 ఒంగోలులో 11.. 


ఒంగోలు (కార్పొరేషన్‌) మార్చి 2 : ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు ఊపందు కున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా కార్పొరేషన్‌ ఎ న్నికలు జరుగుతుండటంతో ఆశావాహులు భారీగానే నా మినేషన్లు వేశారు. ఈనెల 10న ఎన్నికల తేదీ కాగా టీడీపీ, వై సీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, స్వతంత్రులు కలిపి 424 బరిలో ఉన్నారు. తొలిరోజు 11మంది అభ్యర్ధ్థుతమ నామినే షన్లు వెనక్కు తీసుకున్నారు. జనసేన-1, టీడీపీ-1, వైసీపీ-7, ఇండి పెండెంట్‌-2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఉపసంహరణలకు గడు వు ఉండటంతో వైసీపీ, టీడీపీ, స్వతంత్రులు మరికొంతమంది ఉపసంహ రించుకు నే అవకాశం ఉంది. 


Updated Date - 2021-03-03T05:35:32+05:30 IST