18 నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-03T05:26:19+05:30 IST

మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగింది.

18 నామినేషన్ల ఉపసంహరణ

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 2 : మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన  కార్యక్రమంలో 18 నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో వైసీపీ నుంచి 16, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉపసంహరించుకోగా, 15వ వార్డులో వైసీపీ తరఫున నామినేషన్‌ వేసిన శ్రీరాం సుంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


Updated Date - 2021-03-03T05:26:19+05:30 IST