Abn logo
Aug 14 2020 @ 12:05PM

కోడి ముందా..? గుడ్డు ముందా..?: నమ్రత ఏం చెప్పారు?

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌లో నమ్రత హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. అనంతరం మహేష్‌ను వివాహం చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత.. తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


1993 మిస్‌ ఇండియా కార్యక్రమం ఫైనల్‌ రౌండ్‌కు సంబంధించిన వీడియో ఇది. ఫైనల్ రౌండ్‌లో తనకెదురైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి నమ్రత కిరీటం గెలుచుకున్నారు. వందల ఏళ్ల  నుంచి చిక్కు ప్రశ్నగా ఉన్న `కోడి ముందా..? గుడ్డు ముందా..?` అనే ప్రశ్న ఫైనల్ రౌండ్ కంటెస్టెంట్‌లకు ఎదురైంది. ఈ ప్రశ్నకు నమ్రత చెప్పిన.. `కోడి లేకపోతే గుడ్డు లేదు. కనుక కోడే ముందు`అనే సమాధానం నిర్ణేతలను మెప్పించింది. దీంతో మిస్ ఇండియా కిరీటం నమ్రతను వరించింది. ఈ వీడియోను నమ్రత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 



Advertisement
Advertisement
Advertisement