May 14 2021 @ 11:28AM

వీడియో ద్వారా ఈద్ శుభాకాంక్షలు చెప్పిన బాల‌కృష్ణ

శుక్ర‌వారం రంజాన్‌. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్యేక‌మైన వీడియో ద్వారా ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతి కి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపా కటాక్షాలతో  ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకంక్షలు తెలియచేసుకుంటున్నాను’’ అన్నారు. అలాగే ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు సినీ తార‌లంద‌రూ రంజాన్‌ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మోహ‌న్‌బాబు, మ‌హేశ్‌, ఎన్టీఆర్ స‌హా ప‌లువురు ట్విట్ట‌ర్ ద్వారా రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.