హీరోగా, నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కల్యాణ్‌రామ్. ఇప్పుడు నందమూరి కల్యాణ్‌రామ్ ఓ కొత్త ప్రయత్నం చేయబోతున్నాడట. సినీ వర్గాల సమాచారం మేరకు కల్యాణ్‌రామ్ ఓ సినిమాలో త్రిపాత్రాభినయం చేయడానికి ఓకే చెప్పాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాజేంద్ర అనే డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి నేటి తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'జై లవకుశ'లో త్రిపాత్రాభినయం చేసి మెప్పించగా, ఇప్పుడు నందమూరి కల్యాణ్‌రామ్ కూడా అలాంటి ప్రయత్నం చేయబోతున్నారని టాక్. అన్నీ అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.