మంత్రి హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. ల్యాండ్ గ్రాబర్: నందీశ్వర్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-12-18T20:25:56+05:30 IST

మంత్రి హరీష్‌రావు పెద్ద ల్యాండ్‌ మాఫియాగా మారారని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ అన్నారు.

మంత్రి హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. ల్యాండ్ గ్రాబర్: నందీశ్వర్‌గౌడ్‌

సంగారెడ్డి: మంత్రి హరీష్‌రావు పెద్ద ల్యాండ్‌ మాఫియాగా మారారని  మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి హరీష్‌రావు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు, ల్యాండ్ గ్రాబర్ అని ఎద్దేవా చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని నందీశ్వర్‌గౌడ్‌ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-18T20:25:56+05:30 IST