భూమి కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:38:05+05:30 IST

నంద్యాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని కొనడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

భూమి కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలి
ధర్నా చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు

  1. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములు ఇవ్వడానికి వీల్లేదు
  2. సీయూటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా


నంద్యాల, డిసెంబరు 2: నంద్యాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని కొనడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కేటాయించరాదని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటును పూర్తిగా ఆహ్వానిస్తున్నామని, అయితే దీనికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కేటాయించడం దుర్మార్గమని అన్నారు. నంద్యాల చుట్టు పక్కల వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి రూ.20 కోట్లు మంజూరు అయ్యేలా ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఖాదర్‌వలి, పుల్లయ్య, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.








Updated Date - 2020-12-03T05:38:05+05:30 IST