May 14 2021 @ 11:42AM

క‌రోనాతో ద‌ర్శ‌కుడు నంద్యాల ర‌వి క‌న్నుమూత

రచయిత, ద‌ర్శ‌కుడు నంద్యాల రవి కరోనా కారణంగా శుక్రవారం కన్నుమూశారు. కొన్ని రోజుల ముందు ఈయన కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో రవి క‌న్నుమూశారు. కరోనాతో హాస్పిటల్‌లో చేరిన ఈయన, ఒకానొక దశలో హాస్పిట‌ల్ బిల్ చెల్లించ‌లేకుండా ఉన్న స‌మ‌యంలో స‌ప్త‌గిరి ల‌క్ష రూపాయ‌లు ఆర్థిక సాయం అందించారు. పలు చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన నంద్యాల రవి, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాను డైరెక్ట్ చేశారు. స‌ప్త‌గిరితోనూ ఓ సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. కానీ క‌రోనా ఆయ‌న్ని క‌బ‌లించింది. నంద్యాల ర‌వి మృతిపై సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.