Abn logo
Nov 22 2020 @ 15:30PM

నాని, సాయిపల్లవి.. రౌడీ బేబీ సాంగ్‌

Kaakateeya

ధనుశ్‌, సాయిపల్లవి జోడీగా నటించిన చిత్రం 'మారి 2'. ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌ బిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ఈ పాట ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ విషయంలో ధనుశ్, సాయిపల్లవి సహా ఎంటైర్‌ యూనిట్‌ తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ధనుశ్‌, సాయిపల్లవి అభిమానుల ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి నాని, సాయిపల్లవి కలిసి నటించిన ఎంసీఏ చిత్రంలోని పాటను రౌడీ బేబీకి తగినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఎడిట్‌ సాంగ్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరి. 



Advertisement
Advertisement