Abn logo
Jun 30 2020 @ 14:37PM

అదిరిపోయింది రా..: నాని

కామెడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో అల్లరి నరేష్ సరికొత్తగా కనిపించబోతున్న చిత్రం `నాంది`. నరేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టీజర్, దానిలో అల్లరి నరేష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు.


`మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది.. కానీ న్యాయం చెప్ప‌డానికేంటి సార్ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతోంది` అంటూ హీరో అల్లరి నరేష్ ఈ టీజర్‌లో సరికొత్తగా కనిపించాడు. ఈ టీజర్‌పై అల్లరి నరేష్ స్నేహితుడు, నేచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు. `అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు. 



Advertisement
Advertisement
Advertisement