May 14 2021 @ 08:29AM

మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో హీరో నాని..!

వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న నాని త‌న నెక్ట్స్ మూవీలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మై పాత్ర‌లో మెప్పించున్నార‌ట‌. ఇంత‌కీ నాని చేస్తున్న పాత్రేంటో తెలుసా... డిటెక్టివ్‌. వివ‌రాల్లోకెళ్తే, నాని క‌థానాయ‌కుడిగా రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. ఇందులో కోల్‌క‌తాలో ఫ్లాష్ బ్యాక్ ఎసిసోడ్‌లో నాని, డిటెక్టివ్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంద‌ని టాక్‌. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఆరున్న‌ర కోట్ల రూపాయ‌ల‌తో కోల్‌క‌తా సెట్‌ను వేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఈ షెడ్యూల్ వాయిదా ప‌డింది. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.