Abn logo
Aug 10 2020 @ 09:25AM

నాని మాన‌సిక స‌మ‌స్య‌..?

నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. మ‌రో వైపు ఆయ‌న చేయాల్సిన సినిమాల‌కు సంబంధించిన మేక‌ర్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్స్ మొద‌లు పెడ‌తామా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే నాని 26వ చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సెట్స్‌పై ఉంది. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ‘మ‌జ్ను’ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో నాని ఈ చిత్రంలో బై పోలార్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే యువ‌కుడిగా క‌నిపించ‌నున్నార‌ట‌. ఈ మాన‌సిక స‌మ‌స్య ఉన్న‌వారి భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌రి ఇలాంటి పాత్ర‌లో నాని ఎలా మెప్పిస్తారనేది ఆస‌క్తిక‌రంగా మారింది.


Advertisement
Advertisement
Advertisement