‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నాని

కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో జూన్ 11న ఈ చిత్రం విడుదలవుతుంది. ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. బుధ‌వారం(జూన్ 2) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే రా ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ యాక్ష‌న్‌, ర‌స్టిక్ రొమాన్స్ వంటి ప‌లు అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం రూపొందిన‌ట్లు అర్థమ‌వుతుంది. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన నాని మాట్లాడుతూ ‘‘‘అర్ధ శ‌తాబ్దం’ ట్రైల‌ర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఆస‌క్తి పెంచింది. ఆహాలో జూన్ 11న విడుదలవుతుంది. నటీనటులందరూ చక్కగా నటించినట్లు తెలుస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. 


Advertisement
Advertisement