Abn logo
Oct 27 2020 @ 20:22PM

'శ్యామ్‌ సింగరాయ్‌' నిర్మాణ సంస్థ మారడానికి కారణమిదేనా?

Kaakateeya

న్యాచురల్ స్టార్ నాని హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'జెర్సీ' చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.  వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం అందుకుంది. ఈ చిత్ర విజయం తర్వాత  మరోసారి నాని హీరోగా టాక్సీ వాలా వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని ప్రకటించారు. నాని పుట్టినరోజు కానుకగా ఫిబ్రవరి 24న.. 'శ్యామ్ సింగరాయ్' అనే టైటిల్‌ని కూడా ప్రకటించి న్యాచురల్‌ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. కానీ తాజాగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' పోస్టర్స్‌లో బ్యానర్‌ పేరు, నిర్మాత పేరు మారిపోయింది.

నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా తాజాగా విడుదలైన పోస్టర్స్‌లో ఉంది. దీంతో బ్యానర్‌ మార్పు వెనుక ఏం జరిగి ఉంటుందా అనే చర్చలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే.. బడ్జెట్‌ విషయంలోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ వెనక్కి తగ్గిందని.. కానీ స్టోరీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న నాని ఈ ప్రాజెక్ట్‌ని వదిలేయలేక.. వెంటనే మరో నిర్మాతను లైన్‌లో పెట్టాడని అంటున్నారు. సత్యదేవ్ జుంగా కథ అందించిన ఈ చిత్రానికి మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. టక్ జగదీష్ చిత్ర షూటింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ నుంచి నాని శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌లో పాల్గొంటాడని చిత్రయూనిట్‌ ప్రకటించింది. నాని సరసన సాయిపల్లవి, క్రితి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు.


Advertisement
Advertisement