ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తిలక్‌: నన్నయ వీసీ

ABN , First Publish Date - 2020-10-25T07:13:08+05:30 IST

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన అనుభూతివాదకవి తిలక్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు.

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తిలక్‌: నన్నయ వీసీ

దివానచెరువు, అక్టోబరు 24: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన అనుభూతివాదకవి తిలక్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యం-తిలక్‌ వైశిష్ట్యం అనే అంశంపై అంతర్జాల అంతర్జాతీయ సదస్సును శనివారం నిర్వహించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అయితంపూడిలోని మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. దీనికి కన్వీనర్లుగా ఆచార్య రంకిరెడ్డి రామ్మోహనరావు, కె.వి.ఎన.డి.వరప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. ఇది తిలక్‌ శతజయంతి సంవత్సరమని అన్నారు. కవులకు, కళలకు పుట్టినిల్లు అయిన గోదావరి ప్రాంతంలో జన్మించి తన సాహిత్యంతో విశ్వనరుడిగా తిలక్‌ ఎదిగారన్నారు. కార్యక్రమంలో నన్నయ రిజిసా్ట్రర్‌ ఆచార్య బట్టు గంగారావు, కన్వీనర్లు రామ్మోహనరావు, వరప్రసాద్‌, తిలక్‌ జ్యేష్ట కుమారుడు డాక్టర్‌ దేవరకొండ సత్యనారాయణమూర్తి, సినీ సంగీత దర్మకులు ఈవని సత్యనారాయణమూర్తి, వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, తెలుగుశాఖ అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T07:13:08+05:30 IST