‘నన్నయ’లో గోదావరి కల్చరల్‌ మ్యూజియం ఏర్పాటు చేద్దాం

ABN , First Publish Date - 2021-01-21T06:08:46+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా వున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో గోదావరి కల్చరల్‌ మ్యూజియం ఏర్పా టు చేద్దామని తెలుగు భాషా సాంస్కృ తిక అభివృద్ధి మండలి ఛైర్మన్‌ మహ్మ ద్‌ అహ్మద్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

‘నన్నయ’లో గోదావరి కల్చరల్‌ మ్యూజియం ఏర్పాటు చేద్దాం

 తెలుగు భాషా సాంస్కృతిక అభివృద్ధి మండలి చైర్మన్‌ షరీఫ్‌

దివాన్‌చెరువు, జనవరి 20: ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా వున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో గోదావరి కల్చరల్‌ మ్యూజియం ఏర్పా టు చేద్దామని తెలుగు భాషా సాంస్కృ తిక అభివృద్ధి మండలి ఛైర్మన్‌ మహ్మ ద్‌ అహ్మద్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. బుధ వారం ఉపకులపతి మొక్కా జగన్నాథ రావు అధ్యక్షతన జరిగిన సమీక్షలో చైర్మన్‌ షరీఫ్‌తోపాటు ఎమ్మెల్సీ కమిటీ సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పీవీఎస్‌ మాధవ్‌, వి.సుబ్ర హ్మణ్యం పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ప్రగతి నివేదికను, కొవిడ్‌ కాలంలో నిర్వహించిన వెబినార్లు, పరీక్షల నిర్వహణ, ఐఎస్‌వో సాధన గురించి వీసీ వివరించారు. తెలుగుభాష అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గోదావరి కల్చరల్‌ మ్యూజియం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ సిబ్బందికి ఉద్యోగభద్రత కల్పించేందుకు సహకరించాలని కమిటీని వీసీ కోరారు. షరీఫ్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలో వీసీ జగన్నాథరావు చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించి ఆయన్ను ప్రశంసించారు. విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నిర్వహించిన భాషా సాహిత్య అభివృద్ధి అంశాలను కోర్సు కో-ఆర్డినేటర్‌ తరపట్ల సత్య నారాయణ వివరించారు. అనంతరం షరీఫ్‌, ఎమ్మెల్సీలను వీసీ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.  ప్రిన్సిపాల్‌ ఆచార్యఎస్‌.టేకి, తెలుగుశాఖ అధ్యాపకులు టి.సత్యనారాయణ, లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు. 

గోదావరి గట్టున బ్రౌను విగ్రహం ఏర్పాటుచేయాలి

రాజమహేంద్రవరం అర్బన్‌ : తెలుగుభాష పరిరక్షణకు కృషి చేసిన సీపీ బ్రౌను విగ్రహం గోదావరిగట్టున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అలాగే నగరపాలక సంస్థ పాత భవనాన్ని స్మారకం చేయాలని బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి మండలి తెలుగుభాష సాంస్కృతిక అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ను కోరారు. ఈమేరకు బుధవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సన్నిధానం నేతృత్వంలో ఓ బృందం కలసి వినతిపత్రం అందజేశారు. బ్రౌను విగ్రహ స్థాపనకు ఇదే తమ చివరి విన్నపమని ఆయన స్పష్టం చేశారు. గతంలో విగ్రహస్థాపనకు తాము అనేక వినతిపత్రాలు ప్రభుత్వానికి అందజేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఈ విషయం తాము పరిశీలిస్తామని ఛైర్మన్‌ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా సన్నిధానం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ శతాబ్దాలనాటి భవనాన్ని చారిత్రక భవనంగా పరిగణించి యథావిధిగా పునరుద్ధరించాలని కోరారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు మాదేటి రాజాజీ చిత్రించిన ఆదికవి నన్నయ తైలవర్ణచిత్ర పటాన్ని సన్నిధానం శాస్త్రి, మాదేటి రవిప్రకాష్‌, చుండూరి భాస్కర రమణ బహూకరించారు.



Updated Date - 2021-01-21T06:08:46+05:30 IST