నాపోలి స్టేడియానికి మారడోనా పేరు

ABN , First Publish Date - 2020-12-05T14:24:25+05:30 IST

దివంగత అర్జెంటీనా లెజండ్, సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా పేరు ఇటలీలోని నాపోలి శాన్‌పాలో స్టేడియానికి పేరు పెట్టారు....

నాపోలి స్టేడియానికి మారడోనా పేరు

నాపోలి (ఇటలీ) : దివంగత అర్జెంటీనా లెజండ్, సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా పేరు ఇటలీలోని నాపోలి శాన్‌పాలో స్టేడియానికి పేరు పెట్టారు. 1984 నుంచి 1991 వరకు మారడోనా శాన్ పాలో స్టేడియంలో రెండు టైటిళ్లు గెలిచారు. శాన్ పాలో స్టేడియానికి మారడోనా పేరు పెడుతూ నాపోలి నగర కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. లెజండరీ ఫుట్ బాల్ క్రీడాకారుడు మరడోనా పేరును శాన్ పాలో స్టేడియానికి పెట్టాలని నిర్ణయించినట్లు నాపోలి మేయర్ లుయిగి డి మాజిస్ట్రిస్ చెప్పారు. మారడోనా 60 సంవత్సరాల వయసులో గుండెపోటుతో నవంబరు 25న కన్నుమూశారు. 

Updated Date - 2020-12-05T14:24:25+05:30 IST