టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారు: లోకేష్

ABN , First Publish Date - 2021-08-03T22:23:04+05:30 IST

టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారు: లోకేష్

టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారు: లోకేష్

అమరావతి: ఐటీ శాఖ పై జగన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు ఏపీ ఐటీ శాఖ పరిస్థితి తయారైందన్నారు. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యమన్నారు. కనీసం రివ్యూ మీటింగ్కి హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రానికి రాలేదన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు తమ శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీ శాఖ మంత్రి బిజీగా ఉన్నారని విమర్శించారు. కంపెనీలు తీసుకురావడం చేతగాని సలహాదారుల గుంపు టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ బైబై జగన్ అంటున్నాయన్నారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపన్నారు.

Updated Date - 2021-08-03T22:23:04+05:30 IST