Advertisement
Advertisement
Abn logo
Advertisement

తీవ్ర ఉద్రిక్తత.. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి.. : Nara Lokesh

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కనకదుర్గ వారధి దగ్గరికి చేరుకున్నారు. దీంతో వారధి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్నవరం ఎయిర్ పోర్టులోనే లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. వారధి దగ్గరికి వచ్చేసరికి లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో విజయవాడ డీసీపీ హర్షవర్థన్‌రాజుతో లోకేష్‌ వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో లోకేష్‌పై ఓ పోలీసు అధికారి చెయ్యేసి లాగడం గమనార్హం.

పోలీసులపై ప్రశ్నల వర్షం..

అసలు తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పాలని లోకేష్‌.. పోలీసులను నిలదీశారు. ఇప్పటివరకూ తాను పోలీసులకు సహకరించానని.. అయినా ఎందుకిలా చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నోటీసులిచ్చి.. ఏ సెక్షన్‌ కింద అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులపై లోకేష్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు కనకదుర్గ వారధి దగ్గరకు చేరుకోకా.. ఇంకా భారీగానే టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాగా.. ఇవాళ ఉదయం నుంచి లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో పలువురు తెలుగు తమ్ముళ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లోకేష్ వస్తున్నారని తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకోగా.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

ఇవి కూడా చదవండిImage Caption

లోకేశ్‌ పర్యటనపై టెన్షన్‌.. టెన్షన్‌..!రోడ్డుపై కూర్చొని ఆలపాటి రాజా ధర్నా...కోడెల నివాసం వద్ద పోలీసుల ఆంక్షలుఇక సామాన్యప్రజలకు రక్షణేది: అనితనారా లోకేశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గం: జీవీ ఆంజనేయులుమేడికొండూరు ఘటనపై ఏం సమాధానం చెబుతారు?: బీదా రవిచంద్ర‘సజ్జల సభకు వర్తించని నిబంధనలు లోకేష్ పర్యటనకు వర్తిస్తాయా?’

Advertisement
Advertisement