Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుప్పం గడ్డ.. చంద్రన్న అడ్డ: లోకేష్

చిత్తూరు: ‘కుప్పం గడ్డ.. చంద్రన్న అడ్డ’ ఈ నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలయిపై  ఏ గడప తొక్కినా చంద్రన్న ముద్ర ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కుప్పంలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ గత రెండున్నారేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. ఏ రోజైనా జగన్ రెడ్డి నోటి నుంచి కుప్పం అనే పదం వచ్చిందా? అని ప్రశ్నించారు. కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ గొడవలు ఉండవని, ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని లోకేష్ అన్నారు.


ఇప్పుడు తనిఖీల పేరుతో  పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. కుప్పం వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. వి.కోట, శాంతాపురం మండలాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారని, కుప్పం వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి.. ఎక్కడికి వెళ్ళుతున్నారంటూ ఆరా తీస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement