ఇంకో గంట ఇక్కడే కూర్చుంటా: నారా లోకేశ్

ABN , First Publish Date - 2021-04-14T17:20:20+05:30 IST

అలిపిరిలో ఇంకో గంట ఉంటానని, ప్రమాణం చేసి వెళతానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. దమ్మూ, ధైర్యం ఉంటే రావాలని సీఎం జగన్, వైసీపీ నేతలను సవాల్ చేశారు.

ఇంకో గంట ఇక్కడే కూర్చుంటా: నారా లోకేశ్

తిరుపతి: అలిపిరిలో ఇంకో గంట ఉంటానని, ప్రమాణం చేసి వెళతానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. దమ్మూ, ధైర్యం ఉంటే రావాలని సీఎం జగన్, వైసీపీ నేతలను సవాల్ చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసుతో తమకు సంబంధం లేదని అలిపిరిలో ప్రమాణం చేస్తానని, సీఎం జగన్ కూడా చేయాలని లోకేశ్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరికి చేరుకున్న లోకేశ్ మీడియాతో మాట్లాడారు.  ‘‘సీబీఐ ఎంక్వైరీ కోసం ఢిల్లీలో ఆయన చెల్లి సునీత పోరాడుతోంది. పాదయాత్ర చేసిన ఇంకో చెల్లిని హైదరాబాద్‌లో వదిలేశాడు. ఇదీ ఆయన చరిత్ర. హూ కిల్డ్ బాబాయ్ అని ఏపీ ప్రజలంతా అడుగుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. వైకాపా నాయకులు ఎందుకు రావడం లేదు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంకో గంట ఇక్కడే కూర్చుంటా. దొంగ పేపర్లో.. దొంగ ఛానెల్‌లో రాతలు మానుకోవాలి... లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సీఎం కదలాలంటే పెద్ద సమస్య కాదు. తాడేపల్లి ఇక్కడి నుంచి ఎంతో దూరం లేదు. 45 నిమిషాలలో రావొచ్చు.  చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేకానంద కూతురు.. చాలా స్పష్టంగా చెప్పింది. వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి పేర్లను ఆమె వెల్లడించింది. వాళ్లకున్న గొడవల్లో వైఎస్ వివేకాను బలి చేశారు’’ అన్నారు. 

Updated Date - 2021-04-14T17:20:20+05:30 IST