Advertisement
Advertisement
Abn logo
Advertisement

వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు: నారా లోకేష్

అమరావతి: వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడని ఆయన నిలదీశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.07, డీజిల్‌పై రూ.11.75 తగ్గించిందని పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని లోకేష్ వ్యాఖ్యానించారు. వసూల్‌రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించడానికి మనసు రావడంలేదని ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడుతో జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని విమర్శించారు. దేశమంతా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రజలపై వసూల్‌రెడ్డి కరుణ చూపాలని నారా లోకేష్ సూచించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement