Abn logo
Apr 21 2021 @ 09:52AM

మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా చెప్పారు: నారా లోకేష్

అమరావతి: మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా పెద్దలు చెప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను త్యాగం చేయడంతో పాటు.. సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా, కరుణామూర్తిగా కనిపించిన రాముడే... అవసరం అయినప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా అలా చెప్పారు పెద్దలు’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement