జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అంటే ఇదే..: నారా లోకేష్

ABN , First Publish Date - 2020-09-19T19:20:43+05:30 IST

జగన్ సర్కార్‌పై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ వచ్చాక కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు. గుంతలు కూడా పూడ్చని ప్రభుత్వం

జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అంటే ఇదే..: నారా లోకేష్

అమరావతి: జగన్ సర్కార్‌పై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ వచ్చాక కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు. గుంతలు కూడా పూడ్చని ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం. పీల్చే గాలిపై కూడా జగన్ రెడ్డి శిస్తు వసూలు చేయడం ఖాయం. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ... ప్రజలపై ఏడాదికి  రూ.2500 కోట్ల భారం వేస్తున్నారు. కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు కొట్టేయడమే... జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహాత్యం’ అంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-09-19T19:20:43+05:30 IST