Abn logo
Sep 9 2021 @ 19:21PM

లోకేష్‌ను అడుగడుగునా జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు?

అమరావతి: గుంటూరు జిల్లా నరసారావుపేటలోని బాధిత అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనకు అనుమతిలేదని చెప్పడంతో లోకేష్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లారని పోలీసులు పేర్కొంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లోకేష్‌, డ్రైవర్‌ మినహా మిగతావారిని వాహనం నుంచి పోలీసులు దించివేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అనంతరం లోకేష్‌ను ఉండవల్లిలోని ఇంటికి తరలించారు. 

ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘నారా లోకేష్‌ను అడుగడుగునా జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు?. లోకేష్ పర్యాటనంటే జగన్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. అత్యాచారాలను ఆపలేని జగన్ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కడమేంటి?. మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు జగన్ వైఫల్యం కాదా?. జగన్ సర్కార్ అసమర్థతను పోలీసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా?. గుంటూరు జిల్లా పోలీసులే ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారా?. అసలు గుంటూరు జిల్లాలోనే ఎక్కువ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.