Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీపై నిప్పులు చెరిగిన నారా లోకేష్...

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. 


తనపై 11 కేసులు పెట్టారు.. మెుదటి కేసుకు కాస్త జంకాను.. ఆపై ప్రజల కోసమే కదా అని అలవాటు పడ్డానని లోకేష్ అన్నారు. వైసీపీ వాళ్ళలాగ  దోచుకుని, కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్ళలేదన్నారు. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో దొంగదారిన ఒక వార్దును ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. మిగిలిన వన్నీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీకి బుద్ది చెప్పాలని పిలుపిచ్చారు. తనను కుప్పం ఎమ్మెల్యేగా పోటీచేయమన్నారని.. అయితే ఇక్కడి ప్రజల గుండెల్లో దేవుడులా గూడుకట్టుకున్న చంద్రన్న ఉన్నంత వరకూ ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే... కాబోయే ముఖ్యమంత్రి.. అని లోకేష్ వ్యాఖ్యానించారు.


కుప్పం నుంచి ఇక్కడ వైసీపీ నాయకులకు లోకేష్ ఒక హెచ్చరిక చేశారు. కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్దంగా లేరని, వైసీపీ రౌడీయిజానికి.. బెదిరింపులకు.. భయపడేవారుకాదన్నారు. ఈ ఎన్నికలు ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినవని, ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. కుప్పంకు చెందిన సామాన్య ప్రజలు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రన్నను కలిసేందుకు వస్తే.. మంత్రులను కాదని వారితో మాట్లాడి.. వారి సమస్యలు విని.. తీర్చి పంపేవారన్నారు. అదే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి కుప్పం నాయకులు ఎవరైనా అడుగు పెట్టారా..? అని ప్రశ్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement