Abn logo
Sep 21 2021 @ 12:42PM

పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు: నారా లోకేష్‌

అమరావతి: రాష్ట్రంలో జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు  రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న.. ప్రతి ఒక్కడూ జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు పనులకు ఆహా.. ఓహో అంటూ కితాబివ్వడం మాని..పోలీసులు శారద కుటుంబ సభ్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...