నారంగ్‌ అకాడమీకి వానదెబ్బ

ABN , First Publish Date - 2020-10-16T10:06:42+05:30 IST

మూడు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తన షూటింగ్‌ అకాడమీకి ...

నారంగ్‌ అకాడమీకి వానదెబ్బ

రూ. 1.30 కోట్ల మేర నష్టం

హైదరాబాద్‌: మూడు రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తన షూటింగ్‌ అకాడమీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ వాపోయాడు. కోటికిపైగా విలువైన రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు కొన్ని విలువైన పరికరాలు వరద నీటిలో తడిసి పాడైనట్టు నారంగ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపాడు. యువ షూటర్లను తయారు చేయడానికి ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’ అనే అకాడమీని నారంగ్‌ నడుపుతున్నాడు. ‘లోపలికి వచ్చిన వరద నీటితో రేంజ్‌, పరికరాలు, యంత్రాలు పాడయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 1.30 కోట్లు ఉంటుంద’ని నారంగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2020-10-16T10:06:42+05:30 IST