Advertisement
Advertisement
Abn logo
Advertisement

నరంజ్‌ పులావు

కావలసినవి: ఆరెంజ్‌ - నాలుగు, బియ్యం - కేజీ, పెరుగు - పావుకేజీ, నిమ్మకాయలు - రెండు, పంచదార - అరకేజీ, కుంకుమపువ్వు - పావు టీస్పూన్‌; నెయ్యి - పావుకేజీ, ఉప్పు - రుచికి తగినంత, డ్రైఫ్రూట్స్‌ - తగినన్ని, కొత్తిమీర - ఒక కట్ట, మటన్‌ - ఒకకేజీ, నెయ్యి - 1250గ్రా, ఉల్లిపాయలు - పావుకేజీ, అల్లం - 20గ్రా, దాల్చినచెక్కపొడి - కొద్దిగా, యాలకులు - 3గ్రా, ధనియాలపొడి - 20గ్రా, లవంగాలు - 3గ్రా. 


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి. అల్లంను దంచుకోవాలి. కొత్తిమీరను కట్‌ చేసి పెట్టుకోవాలి. నారింజపండ్ల పొట్టు తీసి ముక్కలపై ఉప్పు చల్లి పెరుగులో ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత బయటకు తీసి చల్లటి నీళ్లతో నారింజముక్కలను కడగాలి. ఇప్పుడు ఒక నిమిషం పాటు నీళ్లలో మరిగించి పక్కన పెట్టాలి. స్టవ్‌పై మరొక పాన్‌ పెట్టి నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి. మళ్లీ అందులో నారింజ ముక్కలు వేసి మరోసారి మరిగించాలి. స్టవ్‌పై ఇంకో పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక నెయ్యి వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేగించాలి. ధనియాలపొడి, దాల్చినచెక్కపొడి, యాలకులు, దంచిన అల్లం, లవంగాలు, మటన్‌ ముక్కలు వేసి ఉడికించుకుని యాఖ్ని సిద్ధం చేసుకోవాలి. పంచదార పానకం తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరిగించిన నారింజ ముక్కల గింజలను తీస్తూ, ముక్కలుగా కట్‌ చేసి యాఖ్నిలో కలుపుకోవాలి. అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక టేబుల్‌స్పూన్‌ అన్నంలో కుంకుమపువ్వుతో కలపాలి. మరొకపాన్‌లో యాఖ్ని వేసి, మూడు టేబుల్‌స్పూన్ల పంచదార పానకం వేసి చిన్నమంటపై ఉడికించాలి. పంచదార పానకంను యాఖ్ని మొత్తం గ్రహించాక అన్నం వేసి, కొద్దిగా నెయ్యి వేయాలి. మూతపెట్టి ఆవిరిపోకుండా పిండితో సీల్‌ వేసి ఉడికించాలి. సర్వ్‌ చేసుకునే సమయంలో డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.వెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) ప్రసాదం పులిహోరపాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌
Advertisement