Abn logo
Feb 27 2020 @ 12:38PM

ఫ్లాష్ బ్యాక్‌లో నార‌ప్ప‌

తమిళనాట ఘనవిజయం సాధించిన 'అసురన్'... తెలుగులో 'నారప్ప' పేరుతో రీమేక్ అవుతోంది. వెంకటేశ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. జనవరి 22న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా... ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన 'ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్' షూట్ జరుగుతోందని వినికిడి. ఇందులో భాగంగా వెంకీ తదితరులపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, క‌లైపులిథాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేస‌విలో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement