Jun 11 2021 @ 23:21PM

అనంతపురం యాసలో...

వెంకటేశ్‌, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో మంచి విజయం సాధించిన ధనుష్‌ ‘అసురన్‌’కు ఇది రీమేక్‌. అయితే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారట. ముఖ్యంగా కథానేపథ్యాన్ని అనంతపురం ప్రాంతానికి మర్చారు. అంతే కాదు... సినిమాలో పాత్రలు అనంతపురం యాసలో మాట్లాడనున్నాయి. నటీనటులకు ఆ యాసలో నిపుణుల చేత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల శిక్షణ ఇప్పించారని తెలిసింది. డబ్బింగ్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నటీనటులు సంభాషణలు పలికే విషయంలోనూ, యాస విషయంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు కొంతమేర జరిగాయని సమాచారం. డి. సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.