Abn logo
Jan 14 2021 @ 14:45PM

`నారప్ప` సంక్రాంతి శుభాకాంక్షలు!

తమిళంలో ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న `అసురన్` సినిమాను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి, కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీకాంత్ అడ్డాల శైలిలో పోస్టర్ ఫ్యామిలీ నేపథ్యంలో ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉన్న నారప్ప ఫ్యామిలీ ఫొటోను విడుదల చేశారు. వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. 

Advertisement
Advertisement
Advertisement