నరసాపురాన అలజడి

ABN , First Publish Date - 2022-01-27T05:38:33+05:30 IST

కొత్త జిల్లా కేంద్రంపై బుధవారం తీరంలో దుమారం రేగింది.

నరసాపురాన అలజడి
నరసాపురంలో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

 జిల్లా కేంద్రం మార్పుపై దుమారం


నరసాపురం, జనవరి 26 : కొత్త జిల్లా కేంద్రంపై బుధవారం తీరంలో దుమారం రేగింది. నరసాపురం జిల్లాకు భీమవరం కేంద్రం కావడాన్ని తీర ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై టీడీపీ నాయ కులు ధర్నా చేసి అంబేడ్కర్‌కు వినతిపత్రం అందిం చారు. ఇటు తీర ప్రాంత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సాయంత్రం అఖిలపక్షం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించింది. పార్టీలకతీతంగా అందోళ నలు చేపట్టాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. మరో వైపు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు అసమర్థత వల్లే జిల్లా కేంద్రం తరలిపోయిందని దుయ్య బట్టారు. ఇప్పటికే మెడికల్‌ కాలేజీని తరలించి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. తాజాగా కొంత మంది నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం జిల్లా కేంద్రం నరసాపురం కాకుండా భీమవరానికి మార్చారని మండిపడ్డారు. బ్రిటిష్‌ హయాం నుంచి నరసాపురం సబ్‌ డివిజన్‌ కేంద్రంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రానికి అవసరమైన కార్యాలయాల ఏర్పాటుకు ఇక్కడ కొన్ని ప్రైవేట్‌ భవనాలను కూడా గుర్తించారు. పాలకొల్లు రోడ్‌లోని పాత విజేత కాలేజీ, మండలంలోని గురుకుల పాఠశాల, లక్ష్మణేశ్వరంలోని తుఫాన్‌ భవనాలు పోలీస్‌, కలెక్టర్‌ కార్యాలయాల ఏర్పాటుకు గుర్తించారు. మిగిలిన కార్యాలయాలకు అవసరమైన భవనాలను పరిశీలించా రు. దీంతో ఈ ప్రాంత ప్రజలంతా జిల్లా కేంద్రం నర సాపురం అవుతుందని ఆశతో ఉన్నారు. దీనికి భిన్నంగా జరగడంతో షాక్‌కు గురయ్యారు.  


నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలి


నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని టీడీ పీ, అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు  డిమాం డ్‌ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకూ నాయకులు బుధవారం నిరసన ప్రద ర్శన చేశారు.డ్రై ఫిష్‌ మార్కెట్‌ వద్ద అగ్నికుల క్షత్రి యులు నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ ఛార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ అన్ని పార్లమెంట్‌ కేంద్రాలను జిల్లాలుగా ప్రకటించి నరసాపురానికి మాత్రం భీమ వరాన్ని కేంద్రంగా చేయడం సరికాదన్నారు.


భీమవరం సముచితం : ఎమ్మెల్యే గ్రంధి


భీమవరం, జనవరి 26 : భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి ప్రజల ఆశలను నెరవేర్చారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. భీమవరం పట్టణం అన్ని విధాలుగా జిల్లా కేంద్రానికి సముచిత స్థానం కలిగి ఉందన్నారు.మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు  మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడం శుభపరిణామమన్నారు.

Updated Date - 2022-01-27T05:38:33+05:30 IST