జగన్‌పై పోటీకి నేను రెడీ

ABN , First Publish Date - 2021-10-19T08:36:59+05:30 IST

వైసీపీ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపితే ఆ పదవి కోసం జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. పార్టీ నేతల మద్దతు తనకుందన్నారు. సోమవారం ఇక్కడ

జగన్‌పై పోటీకి నేను రెడీ

  • వైసీపీకీ అధ్యక్ష ఎన్నిక జరపాలి: రఘురామ


న్యూఢిల్లీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపితే ఆ పదవి కోసం జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. పార్టీ నేతల మద్దతు తనకుందన్నారు. సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలనపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుపుతున్నారని, అదే తరహాలో వైసీపీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతోందన్నారు. ఇటీవల తాను క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైతే, తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమని తెలిపారు. వైసీపీని బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అథావలే వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోవలసిన అవసరమేలేదని కొట్టిపారేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, తనపై అనర్హత వేటు వేయించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని రఘురామ విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, ఆ హామీలను తాను గుర్తు చేస్తున్నందుకే అనర్హత వేటు వేయించే పనిలో ఉన్నారని ఆరోపించారు. సినిమా థియేటర్లకు లేని కొవిడ్‌ ఆంక్షలు.. దేవాలయాలకు ఎందుకని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-19T08:36:59+05:30 IST