సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్..

ABN , First Publish Date - 2021-11-08T20:01:07+05:30 IST

కర్నూలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్..

కర్నూలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఆయన్ను అరెస్ట్ చేయాలని, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దన్నారు. చంద్రబాబు అరెస్టుకు కావాలంటే మద్దతు ఇస్తామన్నారు. అమరావతి పాదయాత్రలో సంఘ వ్యతిరేక శక్తులు లేరని, రౌడీ షీటర్లు ఎవరైనా వున్నారంటే వైసీపీ వాల్లే వున్నారని ఆరోపించారు. 


కేంద్రమంత్రి అమిత్ షా తిరుపతికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. తిరుపతికి వచ్చి ప్రధాని మోదీ ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చి ఆమలు చేయలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 35 నుంచి రూ. 40 పెంచి.. రూ. 5 తగ్గిస్తారా? అంటూ మండిపడ్డారు. ఆధాని పోర్టు నుంచి దేశవ్యాప్తంగా మత్తుమందు రవాణా అవుతోందని.. దీనిపై మోదీ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

Updated Date - 2021-11-08T20:01:07+05:30 IST