రమ్య హత్య కేసును రాద్దాంతం చేయొద్దు: నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-08-18T00:51:29+05:30 IST

రమ్య హత్య కేసును తెలుగుదేశం రాద్దాంతం చేయొద్దని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు.

రమ్య హత్య కేసును రాద్దాంతం చేయొద్దు: నారాయణస్వామి

చిత్తూరు: రమ్య హత్య కేసును తెలుగుదేశం రాద్దాంతం చేయొద్దని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రమ్య హత్య కేసులో టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్దాంతం మానుకోవాలని హితవు పలికారు. ఎస్సీలకు ఏదో జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడైనా ఎస్సీలను ఆదరించిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ సమానత్వం కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎస్సీలకు చంద్రబాబు ఎందులో ప్రాధాన్యత కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మహిళలకు రక్షణ కవచంలాగా ఉన్నారన్నారు. రమ్య హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని చెప్పారు.ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని  నారాయణస్వామి పేర్కొన్నారు.

Updated Date - 2021-08-18T00:51:29+05:30 IST