ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది: నరేగా నిధులపై ఏపీ హైకోర్టు తీర్పు

ABN , First Publish Date - 2021-10-06T02:19:54+05:30 IST

నరేగా బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు 55 పేజీల తీర్పునిచ్చింది. నరేగా పనులపై విజిలెన్స్ విచారణ ముగిసినప్పటికీ ఇంకా జరుగుతోందని.. ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని ఏపీ హైకోర్టు పేర్కొంది.

ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది: నరేగా నిధులపై ఏపీ హైకోర్టు తీర్పు

అమరావతి: నరేగా బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు 55 పేజీల తీర్పునిచ్చింది. నరేగా పనులపై విజిలెన్స్ విచారణ ముగిసినప్పటికీ ఇంకా జరుగుతోందని.. ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని ఏపీ హైకోర్టు పేర్కొంది. విజిలెన్స్ విచారణ జరగడం లేదని ఏపీ సీఎస్‌కు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నెపం వేసుకుంటూ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టాయని ఏపీ హైకోర్టు తెలిపింది. నరేగా పనుల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని, ఒకరి డబ్బుతో మరొకరు ప్రయోజనం పొందడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం.. ఇక్కడ అదే జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం నరేగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చట్టంలో పొందుపరచాలని ఏపీ హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2021-10-06T02:19:54+05:30 IST