సిరివెన్నెల కుటుంబానికి మోదీ లేఖ! తమిళసై పరామర్శ!


ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబ సభ్యులను ఓ లేఖ రాశారు. ‘‘శ్రీమతి పద్మావతిగారు సిరివెన్నెల సీతారామశాస్ర్తి గారి మరణించడం చాలా బాధాకరం. తీవ్ర దుఃఖంతో ఉన్న మీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. బహుముఖ కవి, శాస్ర్తిజీ తన స్వరకల్పనల ద్వారా ఆ కాలంలోని సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విస్తృతంగా ప్రసిద్ది చెందారు. సిరివెన్నెల తెలుగు భాషపై పట్టు కలిగిన వ్యక్తే కాదు.. పదం పట్ల భావాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా. సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సహకారానికి పద్మశ్రీ లాంటి అవార్డు పొందారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ భావోద్వేగ లేఖను రాసారు మోదీ. తెలంగాణ గవర్నర్‌ తమిళసై కూడా సీతారామశాస్ర్తి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 




Advertisement