ఇజ్రాయెల్ సహకారంతో 150 శ్రేష్ఠ గ్రామాలు : తోమర్

ABN , First Publish Date - 2022-01-28T23:40:47+05:30 IST

ఇజ్రాయెల్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో 12 రాష్ట్రాల్లోని

ఇజ్రాయెల్ సహకారంతో 150 శ్రేష్ఠ గ్రామాలు : తోమర్

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో 12 రాష్ట్రాల్లోని 150 గ్రామాలను శ్రేష్ఠ గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు  కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.  ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 29 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌ (CoEs)లను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపింది. వీటిలో 25 మిలియన్లకుపైగా కూరగాయల మొక్కలు, 3,87,000 పండ్ల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. సంవత్సరానికి 1.2 లక్షల మందికిపైగా రైతులకు శిక్షణనిస్తున్నట్లు తెలిపింది. 


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొదటి దశలో 75 గ్రామాలను శ్రేష్ఠ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. భారత దేశం, ఇజ్రాయెల్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేస్తాయన్నారు. భారత దేశానికి ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలన్‌తో జనవరి 27న జరిగిన సమావేశంలో తోమర్ ఈ వివరాలను వెల్లడించారు. 


Updated Date - 2022-01-28T23:40:47+05:30 IST