త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-18T05:11:22+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల రహదారిపై నగల్లపాడుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజన్‌కు ప్రమాదవశాత్తు శనివారం నిప్పంటుకుంది.

త్రుటిలో తప్పిన ప్రమాదం


చాగలమర్రి, ఏప్రిల్‌ 17:
చాగలమర్రి గ్రామంలోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల రహదారిపై నగల్లపాడుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజన్‌కు ప్రమాదవశాత్తు శనివారం నిప్పంటుకుంది. ట్రాక్టర్‌ ఇంజన్‌ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అప్రమత్తమై ట్రాక్టర్‌ను పక్కకు నిలిపి వేశాడు. అటుగా వస్తున్న పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు మంటలను అదుపు చేశారు.  ట్రాక్టర్‌ పాక్షికంగా  దెబ్బతిన్నది. ఎండలు అధికంగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2021-04-18T05:11:22+05:30 IST