లక్ష్మీ పార్వతిని ఇమిటేట్ చేసిన MP Raghurama Raju

ABN , First Publish Date - 2021-07-27T20:55:39+05:30 IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సెటైర్లకు నెట్టింట నవ్వుల వర్షం కురుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ఆయన తాజాగా తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతిపై...

లక్ష్మీ పార్వతిని ఇమిటేట్ చేసిన MP Raghurama Raju

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సెటైర్లకు నెట్టింట నవ్వుల వర్షం కురుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ఆయన తాజాగా తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతిపై కామెంట్స్ చేశారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు అకాడమీ విషయంలో ఆమె ధోరణిని తప్పుబట్టారు. అంతేగాక ఆమెలా మాట్లాడుతూ..వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష్మీ పార్వతి చక్కగా హరి కథలు చెప్పేవారని.. తెలుగు అంటేనే ఎన్టీ రామారావు అనే ఆమె ఇలా పదవుల కోసం మారడం మంచిది కాదని హితవు పలికారు. 


ఆమె మళ్లీ తెలుగును ప్రేమించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీ రామారావుకి తలవంపులు తీసుకు వస్తున్నారన్న అపవాదును ఆమె మూటగట్టుకుంటున్నారని రఘురామ రాజు అన్నారు. తన కంటే పెద్దవారని, తను ఎంతో అభిమానించే వాడినని.. అయినప్పటికీ రామారావు సతీమణి కాబట్టి.. ఆమెలో మార్పు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 



Updated Date - 2021-07-27T20:55:39+05:30 IST