ప్రాణాలుపోతున్నా పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-07-09T12:04:21+05:30 IST

కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నర్సింహారెడ్డి ఆరోపించారు.

ప్రాణాలుపోతున్నా పట్టించుకోరా?

కొత్తూర్‌/చేవెళ్ల: కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నర్సింహారెడ్డి ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించేందుకు బయలుదేరిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగులను చేర్చుకోవడం లేదన్నారు. అరెస్టైన వారిలో నాయకులు షకీల్‌, ఎల్లయ్య, మహ్మద్‌ రవూఫ్‌, సాయిబాబా తదితరులున్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలకేంద్రంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రామస్వామి ఆధ్వర్యంలో టిమ్స్‌ సందర్శనకు సీపీఐ నాయకులువెళ్లకుండా ఇళ్ల వద్దే ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 


ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నియంతలా పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని పేర్కొన్నారు. టిమ్స్‌లో ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం తప్పా అని ప్రశ్నిం చారు. టిమ్స్‌ సందర్శనను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం  దారుణ మన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. అరెస్టైన వారిలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్‌, తదితరులున్నారు.  

Updated Date - 2020-07-09T12:04:21+05:30 IST