నాసా పర్సివరెన్స్ టెస్ట్ డ్రైవ్ సక్సెస్

ABN , First Publish Date - 2021-03-07T00:49:39+05:30 IST

అంగారక గ్రహంపైకి పంపించిన పర్సీవరెన్స్ రోవర్ విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) గురువారం అధికారికంగా వెల్లడించింది. 6 చక్రాలతో నడిచే ఈ రోవర్‌ను మొదటిసారి..

నాసా పర్సివరెన్స్ టెస్ట్ డ్రైవ్ సక్సెస్

వాషింగ్టన్: అంగారక గ్రహంపైకి పంపించిన పర్సీవరెన్స్ రోవర్ విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) గురువారం అధికారికంగా వెల్లడించింది. 6 చక్రాలతో నడిచే ఈ రోవర్‌ను మొదటిసారి 6.5 మీటర్లు(21.3 అడుగులు) దూరాన్ని దాదాపు 33 నిముషాలపాటు ముందుకు నడిపినట్లు వెల్లడించింది. ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి ముందుగా 4 మీటర్లు ముందుకు నడిపి ఆ తరువాత 150 డిగ్రీల కోణంలో మలిచామని, అక్కడి నుంచి మరో 2.5 మీటర్లు ముందుకు నడిపామని నానా వెల్లడించింది. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని పర్సీవరెన్స్ మొబిలిటీ టెస్ట్ బెడ్ ఇంజనీర్ అనయిస్ జరీఫియన్ మాట్లాడుతూ.. పర్సీవరెన్స్ టెస్ట్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేశామని, ఇది తమ మొబిలిటీ బృందం చేరుకున్న ఓ గొప్ప మైలురాయిగా భావిస్తామని వెల్లడించారు. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలో మరింత సుదూర ప్రయాణాలకూ రోవర్‌ను సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. దీనికోసం సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని చెప్పారు.


 ‘మార్స్‌పై రోజు భూమిపైకంటే కొంత ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం ఓ రోజులో పర్సీవరెన్స్ రోవర్ ఒక రోజులో(మార్స్ గ్రహంపై రోజు)లో 200 మీటర్లు ప్రయాణించగలద’ని చెప్పారు. ఇంతకుముందు నాసా ద్వారా మార్స్‌పైకి పంపించిన క్యూరియాసిటీ కంటే ఇది 5 రెట్లు వేగంగా ప్రయాణించగలదని, క్యూరియాసిటీ 8 ఏళ్లుగా ఎంతో అమూల్యమైన సేవలందిస్తోందని అన్నారు. పర్సీవరెన్స్ డిప్యూటీ మిషన్ మేనేజర్ రాబర్ట్ హాగ్ కూడా పర్సీవరెన్స్ విజయంపై మాట్లాడారు. తొలి అడుగు విజయవంతంగా పూర్తి చేశామని, త్వరలో రోవర్‌లో ఉన్న డ్రోన్‌ను కూడా ఎగురవేసేందుకు ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2021-03-07T00:49:39+05:30 IST