నర్సరీ రైతులకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం

ABN , First Publish Date - 2021-01-21T06:15:13+05:30 IST

కడియం నర్సరీ రైతులకు పశ్చిమగోదావరిజిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యానవిశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం అందనుంది.

నర్సరీ రైతులకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం

 ఉద్యాన విశ్వవిద్యాలయం, నర్సరీ సంఘం ఒప్పందం

కడియం, జనవరి 20: కడియం నర్సరీ రైతులకు పశ్చిమగోదావరిజిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యానవిశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం అందనుంది. ఈమేరకు ఉద్యానవిశ్వవిద్యాలయం, కడియం సర్‌ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ అసోసియేషన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కడియం నర్సరీల  కృషిని పాఠ్యాంశంగా చేర్చినట్లు ఉద్యాన విశ్వవిద్యాలయం తెలిపింది. తాడేపల్లిగూడెంలోని వెంకట్రామన్నగూడెంలో ఉ ద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు కొట్టు సత్య నారాయణ, అబ్బయ్యచౌదరి, విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకీరామ్‌, ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి, వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణకుమార్‌ తదితరులు హాజరయ్యారు. నర్సరీరైతులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు దేశవిదేశాల్లో వాణిజ్యరంగంలో మంచి పోటీ ఇచ్చేలా రైతులకు మంచి వంగడాల రూపకల్పన అవసరమని భావించి మంత్రుల సమక్షంలో వైఎస్సార్‌ విశ్వవిదాల్యయం ఉపకులపతిని సర్‌ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ సంఘం కోరారు. సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను అనుసరించి కొత్త వంగడాల రూపకల్పన చేయించాలని కోరారు. దీంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్‌ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ సంఘం అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ, కార్యదర్శి బొర్సు సుబ్బారాయుడు, కోశాధికారి పాటంశెట్టి బుజ్జిబాబు ఉన్నారు. 



Updated Date - 2021-01-21T06:15:13+05:30 IST