సాహిత్య పోటీలు ప్రారంభించిన.. ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా)..!

ABN , First Publish Date - 2020-07-13T19:12:56+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా).. నాటా 2020 సాహిత్య పోటీల పేరుతో కథలు, కవితలు, కార్టూన్ల పోటీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిం

సాహిత్య పోటీలు ప్రారంభించిన.. ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా)..!

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా).. నాటా 2020 సాహిత్య పోటీల పేరుతో కథలు, కవితలు, కార్టూన్ల పోటీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 31, 2020 వరకు తమ కవితలు, కథలు, కార్టూన్లను rachanalu@nataus.org కి పంపాల్సిందిగా కోరింది. కథ ఐదు పేజీలు, కవిత రెండు పేజీలకు మించకూడదని నాటా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒక అభ్యర్థి ఒక విభాగంలో ఒక ఎంట్రీని మాత్రమే పంపాల్సి ఉంటుందని వెల్లడిచింది. ఒక్కో విభాగంలో ఐదింటిని ఎంపిక చేసి, అభ్యర్థులకు బహుమతి ప్రధానం చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు, రిజిస్ట్రేషన్ కోసం www.nataus.org/rachanalu2020 ని సందర్శించాలని పేర్కొంది. 




Updated Date - 2020-07-13T19:12:56+05:30 IST