శశిరకు జాతీయస్థాయి కళాఉత్సవ్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-01-19T04:55:12+05:30 IST

శశిరకు జాతీయస్థాయి కళాఉత్సవ్‌ అవార్డు

శశిరకు జాతీయస్థాయి కళాఉత్సవ్‌ అవార్డు

  • కలెక్టర్‌, డీఈవో, అధికారుల ప్రశంసలు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): ఎన్‌సీఈఆర్టీ సమగ్ర శిక్ష అధ్వర్యంలో 2021లో జాతీయ స్థాయిలో నిర్వహించిన దృశ్య శ్రవణ సంప్రదాయ నృత్య పోటీల్లో మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదవుతున్న కె.శశిరకు ఉత్తమ అవార్డు వచ్చింది. జవవరి 1 నుంచి 12 వరకు నిర్వహించిన వర్చ్యువల్‌ పోటీల్లో క్లాసికల్‌ విభాగంలో శశిర తెలంగాణ నుంచి ఎంపికైనట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. ఎన్సీఈఆర్టీ కళా ఉత్సవాల పేరుతో యేటా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సారి వర్చ్యువల్‌ విధానంలో పోటీలను నిర్వహించారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌ పక్కనున్న బాల్‌ భవన్‌లో పోటీలు నిర్వహించారు. రామంతపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూ ల్‌ విద్యార్థిని శశిర క్లాసికల్‌ డాన్స్‌లో జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. పోటీలను 18 విభాగాల్లో నిర్వహించారు. అవార్డు విన్నర్‌ శశిరను మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అభినందించారని డీఈవో ఎన్‌ఎ్‌సఎ్‌స.ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-01-19T04:55:12+05:30 IST