జాతీయస్థాయి క్రీడలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-08-03T05:09:54+05:30 IST

జాతీయస్థాయి క్రీడలను విజయవంతం చేయాలి

జాతీయస్థాయి క్రీడలను విజయవంతం చేయాలి
క్రీడాపోటీల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, సీపీ తరుణ్‌జోషి

చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

అథ్లెటిక్స్‌ పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ


వరంగల్‌ అర్బన్‌ స్పోర్ట్స్‌, ఆగస్టు 2 : అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సం యుక్త ఆధ్యర్యంలో సెప్టెంబరు 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ప్రభు త్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కోరారు. సోమవారం హ న్మకొండ సుబేదారిలోని స్వాగత్‌ గ్రాండ్‌ బాంక్వెట్‌ హాల్‌లో తె లంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన స న్నాహాక సమావేశంలో పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్‌ త ర్వాత రెండో అతిపెద్ద నగరంగా రూపాంతరం చెందుతున్న  ఓరుగల్లు నగరాన్ని అన్ని విధాలా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఐటీ, ఎడ్యూకేషన్‌, స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు. పర్యాటక రంగానికి మంచి పేరున్న ఓరుగల్లు లో జాతీయస్థాయి క్రీడా పోటీలను నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు.  

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) డాక్టర్‌ తరుణ్‌జోషి మాట్లాడుతూ గతంతో పోలిస్తే నేడు క్రీడాకారులకు అన్ని ర కాల వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వరంగల్‌లో జూనియర్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించినప్పుడు తాను ఇక్కడే ఓఎ్‌సడీగా విధులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ సుమారు రూ.43 లక్షల వ్యయంతో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. తె లంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఈ స్టాన్‌లీజోన్స్‌, జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోశాధికారి బైరబోయిన కైలా్‌సయాదవ్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శిఽ పింగిలి రమే్‌షరెడ్డి, ఖో-ఖో అసోసియేషన్‌ కార్యదర్శి శ్యాం, షైన్‌ విద్యా సం స్థల చైర్మన్‌ ఎం. కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:09:54+05:30 IST