ముగిసిన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-01-20T04:50:30+05:30 IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీమ్‌లు పాల్గొనగా ఎంఎ్‌సఆర్‌ ఎంఎక్స్‌1 జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతిని సాధించుకుంది. అదేవిధంగా రెండవ స్థానంలో కేవైసీసీ ఎక్స్‌1, మూడవ స్థానంలో ఎక్స్‌1స్టార్‌, నాల్గవ స్థానంలో ఈఎ్‌సబీఎక్స్‌1 టీమ్‌లు విజేతలుగా నిలిచాయి. విజేతల టీమ్‌లకు తెలుగు యువత నేత ఫిరోజ్‌, కనిగిరి టీడీపీ నగర అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డిలు బహుమతులు అందజేశారు.

ముగిసిన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు
విజేతలకు బహుమతులు అందచేస్తున్న టీడీపీ నాయకులు

- బహుమతుల ప్రదానం చేసిన తెలుగు యువత

కనిగిరి, జనవరి 19: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీమ్‌లు పాల్గొనగా ఎంఎ్‌సఆర్‌ ఎంఎక్స్‌1 జట్టు  విజేతగా నిలిచి మొదటి బహుమతిని సాధించుకుంది. అదేవిధంగా రెండవ స్థానంలో కేవైసీసీ ఎక్స్‌1, మూడవ స్థానంలో ఎక్స్‌1స్టార్‌, నాల్గవ స్థానంలో ఈఎ్‌సబీఎక్స్‌1 టీమ్‌లు విజేతలుగా నిలిచాయి. విజేతల టీమ్‌లకు   తెలుగు యువత నేత ఫిరోజ్‌, కనిగిరి టీడీపీ నగర అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డిలు బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30వేలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 20వేలు, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 10వేలు, నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 7,500ల నగదును అందజేయడమే కాకుండా మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు టోర్నమెంట్‌ కప్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ షేక్‌ జంషీర్‌ అహ్మద్‌, మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి, మూలే బాలిరెడ్డి, అచ్చాల రవి, కోటా సురేష్‌, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, ఇర్ఫాన్‌, ఫయాజ్‌, ఖాజా, ఇలియాజ్‌, బ్రహ్మం, జిలాని, మనోజ్‌, షాహిద్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-20T04:50:30+05:30 IST